Minister Sabitha:తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) సిబ్బంది అని చెప్పి ఓ షూస్ కంపెనీని మోసం చేశారు. ఆ సంస్థ నుంచి రూ.లక్షలు వసూల్ చేశారు. ఎంతకు కాంట్రాక్ట్ రాకపోవడంతో హైదరాబాద్ వచ్చి ఆరా తీయగా మోస పోయామని గ్రహించారు. ఏడుగురు నిందితులపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందంటే..
సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో షూస్ (Shoe), స్కూల్ బ్యాగ్స్ (school bags) పంపిణీ ఆర్డర్ ఇవ్వాలని హర్యానాలో గల కర్నైల్కు చెందిన లిబర్టీ షూట్ కంపెనీ 2019లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని (Sabitha Indra Reddy) కలిసింది. ఆ సమయంలో జీకే కుమార్ (kumar) మంత్రి పీఏగా ఉన్నారు. తర్వాత అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిని ఆసరాగా చేసుకుని కుమార్ లిబర్టీ కంపెనీ ప్రతినిధులను సంప్రదించాడు.
మంత్రి పీఎగా కుమార్, మరో పీఏగా బెల్లి తేజ (teja), పొలిటికల్ సెక్రటరీగా ప్రవీణ్ వర్మ (praveen varma) తదితరులు లిబర్టీ సంస్థ ప్రతినిధి కమల్ ధవన్‌కు (kamal dhavan) ఫోన్ చేశారు. షూస్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడదామని హైదరాబాద్ పిలిపించారు. కాంట్రాక్ట్ ఫైనల్ చేస్తామని.. ప్రాసెసింగ్ ఫీజులతోపాటు ఇతర చార్జీల కింద రూ.17.66 లక్షలను వసూల్ చేశారు. ఆ నగదును వివిధ అకౌంట్లకు పంపించాలని కోరగా.. కంపెనీ చెల్లించింది. డబ్బులు చెల్లించినప్పటికీ కాంట్రాక్ట్ రాలేదు.
హైదరాబాద్ (hyderabad) వచ్చి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అంతకుముందు కుమార్ పీఏగా చేశాడని.. తర్వాత తీసివేశారని తెలుసుకున్నారు. మోసపోయామని తెలుసుకుని లిబర్టీ షూస్ కంపెనీ ప్రతినిధి కమల్ ధావన్ (kamal) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.