తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయి. గడిచిన నాలుగున్నర ఏళ్లలో లేని పోస్టులు ఇప్పుడే వేయడానికి కారణం కేవలం ఎన్నికల స్ట్రాటజీయేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు కూడా దీనికి సుముఖంగ లేరని తెలుస్తోంది.
DSC Notification, Sabitha Indra Reddy, Telangana Government, BRS Party
Sabitha Indra Reddy: తెలంగాణ (Telangana) ప్రభుత్వం విద్యార్థుల బలహీనతో ఆడుకోవడం గత ఏడాది నుంచే మొదలు పెట్టింది. ఉద్యోగాల (Jobs) పేరుతో ప్రకటనలు విడుదల చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా గ్రూప్-1 పరీక్షలో జరిగిన పరిణమాలు యువతలో నిరాశను మిగిల్చింది. టీఎస్ఎపీస్సీ (TSPSC) నిర్వహించే గ్రూప్ 2 విషయంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అని.. టీచర్ పోస్టుల భర్తీకి 2 రోజుల్లో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) వెల్లడించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నాయి. ఈ సారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ ప్రకటన ఎన్నికల స్ట్రాటజీయే అని నిరుద్యోగులు కూడా భావిస్తున్నారు. ఇది వరకు తెలంగాణ కార్మికశాఖమంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు దగ్గరపడుతుండంతో నిరుద్యోగులు ఆందోళనలు చేస్తారని ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా జాబ్ ప్రకటనతో వాళ్ల చేతులు కట్టేయ్యోచ్చని భావిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటివి ఎన్ని ఎత్తుగడలు వేసినా ఈ సారి బీఆర్ఎస్ ఆటలు సాగవని విమర్షిస్తున్నాయి.