తెలంగాణ (Telangana)లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు (Rains) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ( Meteorological Center) వెల్లడించింది. రాష్ట్రంలొని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వరంగల్ (Warangal)లో 49.3 మి.మి, మహబూబాబాద్‌లో 32.3 మి.మి, నల్లగొండలో 30.8 మి.మి వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) తెలిపింది. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని, పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.