»Kcr Health Bulletin Released In Hospital For 5 Days
KCR Health: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల..5 రోజుల వరకూ ఆస్పత్రిలోనే
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. ఈ తరుణంలో నేడు ఆయన హెల్త్ బులెటిన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. మరో 5 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలని, కేసీఆర్ కోలుకోవడానికి పూర్తిగా నాలుగు నెలల వరకూ పడుతుందని వైద్యులు నిర్దారించారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ తాజా బులెటిన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు 4 గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిందని, మేజర్ సర్జరీ కావడం వల్ల ఆయనకు మరింత పర్యవేక్షణ అవసరం అవుతుందని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Shri KCR Sir’s hip replacement surgery has been successfully completed at Yashoda Hospital. He is doing very well now.. Let us pray for his speedy recovery and soon to be back in action.. pic.twitter.com/J4sx1SQmLk
ఐవి ఫ్లూయిడ్స్, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తో కేసీఆర్‌కు మెడికేషన్ కొనసాగుతోందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ డైట్ అందిస్తున్నామన్నారు. ఆయన కొంత కోలుకున్న తర్వాతే నడిపించే ప్రయత్నం చేస్తామన్నారు.
యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన కేసీఆర్ గారి తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స..
హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు.. కేసీఆర్ గారికి నిర్వహించిన సర్జరీ విజయవంతం అయినట్లు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సకు ఆయన శరీరం బాగానే సహకరించిందని వారు తెలిపారు. సర్జరీ విజయవంతం… pic.twitter.com/icb8zjyxYZ
కేసీఆర్‌కు ఫిజియోథెరపీ కూడా నిర్వహిస్తామని, ఇంకా 5 రోజుల పాటు కేసీఆర్ ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. ఆయనకు ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణ ఎంతో అవసరం అన్నారు. కేసీఆర్ రికవరీకి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వెల్లడించారు. సీనియర్ సిటిజన్ కావడం వల్ల కేసీఆర్ సాధారణ స్థితిలోకి వచ్చి నడిచేందుకు కనీసం నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు.