»Ktr Ktrs Previous Comments On Prajadarbar Video Going Viral
KTR: ప్రజాదర్బార్‌పై గతంలో వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న వీడియో!
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
KTR: సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పేరుని జ్యోతిబాపులే ప్రజా భవన్‌గా మార్చి ప్రజల వద్ద ఆర్జీలు స్వీకరిస్తున్నారు. ఆర్జీలు సమర్పించడానికి మొదటిరోజు ప్రజా భవన్‌కు భారీగా తరలి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ప్రజల వద్దకు నేరుగా వచ్చి ఆర్జీలు స్వీకరించారు. మాజీ మంత్రి కేటీఆర్ గతంలో ప్రజాదర్బార్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రజా దర్బార్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో వివరంగా తెలిపిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
I had a lot of respect on KTR but its totally trashed now after watching this video..
if they want to show their governance is good then do praja darbar and prove the world that no one is coming as ppl do not have any more problems.. similar to what is shown in OkeOkkadu movie https://t.co/rkrOzwJlfS
ప్రజా దర్బార్ గురించి మేం కూడా ఒకానొక సందర్భంలో కేసీఆర్‌ని అడిగామని, ఆయన చెప్పిన సమాధానం విన్నాక ప్రజా దర్బార్ వ్యవహారంపై తమకు స్పష్టత వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ప్రజల ముందు, మీడియా ముందు షో చేయేలానుకునేవారు మాత్రమే ప్రజా దర్బార్ నిర్వహిస్తారని, అవన్నీ షో పుటప్ అని కేసీఆర్ అన్నట్టుగా కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వంలో ఆరున్నర లక్షల మంది ఉద్యోగులున్నారని, వారంతా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఉన్నారని, అందుకే సీఎం నేరుగా జోక్యం చేసుకుని అర్జీలు స్వీకరించాల్సిన పరిస్థితి లేదని అన్నారు.
పెన్షన్ కోసం, రేషన్ కార్డ్ కోసం, పట్టాదార్ పాస్ బుక్‌లో పేరు ఎక్కడం లేదంటూ.. ప్రజలు ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి ఉందంటే.. ఆ వ్యవస్థలోనే లోపం ఉన్నట్టు లెక్క. ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారం అవ్వాలి. కింది స్థాయి అధికారులు పని చేయకపోతే అప్పుడు సీఎం దగ్గరకు రావాలి. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం సీఎం చేయాల్సినవి కాదు. దానికో యంత్రాంగం ఉంది. వారు ఆ పనులు పూర్తి చేయాలి. శాసన సభ్యులు, మండలి సభ్యులు చేయాల్సింది ఇది కాదు. వారు చట్టాలు రూపొందించాలి. అవి పగడ్బందీగా అమలవుతున్నాయో లేవో చూడాలి. తాము ప్రజల మనుషులం అని చెప్పుకునేవారే ప్రజా దర్బార్ అని షో పుటప్ చేస్తారని గతంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.