NagaChaitanya: గ్రాండ్‌గా మొదలైన నాగ చైతన్య ‘తండేల్’!
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య.. రీసెంట్గా వచ్చిన 'దూత' వెబ్ సిరీస్‌తో మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇదే జోష్‌లో ఇప్పుడు తండేల్ కోసం రంగంలోకి దిగాడు చైతన్య. తాజాగా తండేల్ పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి.
ఈసారి లవర్ బాయ్ ఇమేజ్ పక్కకు పెట్టేసి.. పక్కా మాస్ హీరోగా రాబోతున్నాడు నాగ చైతన్య. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు చైతన్య. గతంలో నాగ చైతన్య, చందు మొండేటి కలిసి ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు చేసారు. ఈసారి సముద్రం బ్యాక్ డ్రాప్లో ‘తండేల్’ అనే ఊరమాస్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య జాలరీగా కనిపించనున్నాడు. శ్రీకాకుళం, విశాఖపట్నం, గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల్లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు అల్లు అరవింద్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అయింది. తాజాగా ‘తండేల్’ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ పూజా కార్యక్రమానికి సాయి పల్లవి కూడా వచ్చింది. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ కలిసి శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మరోసారి ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయింది. దీంతో తండేల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి తండేల్‌లో చైతన్య ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.