NLR: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మార్కాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోడ్డు మార్గాన డిప్యూటీ సీఎం ఉదయం 10 గంటలకు సంతమాగులూరు మండలం మీదుగా శుక్రవారం మార్కాపురం వెళ్లనున్నారు. సంతమాగులూరు మండలంలోని జనసైనికులు పవన్‌కు భారీ ఎత్తున స్వాగతం ఏర్పాటు చేస్తున్నారు.