ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. అలాగే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు చరణ్. ఇక ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ అవార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు చరణ్.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా రాబట్టిన ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ అవార్డుతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ రావడంతో తారక్, చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయాయి. అంతేకాదు.. ఇద్దరికీ ఎన్నో అవార్డ్స్ వరించాయి. తాజాగా రామ్ చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చి చేరింది.
అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్.. ఇండియాలోని బాలీవుడ్ యాక్టర్స్ అండ్ సినిమాలకు ఇస్తుంటారు. ఇప్పటికే ఈ అవార్డ్స్ నామినేషన్స్‌లో.. రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అదా శర్మ, దీపికా పదుకొనే, రాశి ఖన్నా వంటి వారు చోటు దక్కించుకున్నారు. తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ ప్రకటించారు. తెలుగు నుంచి రామ్ చరణ్‌కు పాప్ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది. దీంతో రామ్ చరణ్ పేరు సోషల్ మీడియా టాప్ ట్రెండ్ అవుతోంది.
రీసెంట్గా నేషనల్ అవార్డు మిస్ అయినా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ అవార్డు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. గేమ్ చేంజర్ అప్డేట్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతునే ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ మాత్రం లాక్ చేయలేదు. కనీసం టీజర్ అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. మరి శంకర్ ఎప్పుడు గేమ్ చేంజర్ అప్డేట్ ఇస్తాడో చూడాలి.