Tillu Square: టిల్లు స్క్వేర్ కి మళ్లీ ఇంకో సీక్వెన్స్ ఉందా..?
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న 'టిల్లు స్క్వేర్' నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటలతో ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీనివల్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
టిల్లు స్క్వేర్ విడుదల తేదీ వాయిదా పడటంపై ఇది వరకే సిద్ధు జొన్నలగడ్డ క్షమాపణలు చెప్పాడు. సినిమా విడుదల ఆలస్యం అయినా కూడా తప్పకుండా గతం కంటే రెండు రెట్లు సరదాగా ఉంటుందని హామీ ఇచ్చాడు. సిద్ధు ఇప్పుడు ఈ మూవీకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. టిల్లు స్క్వేర్ 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ మధ్యనే నితిన్‌తో ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ప్రమోషన్స్ కోసం సిద్ధు జరిపిన ఇంటరాక్షన్‌లో టిల్లూ స్క్వేర్ సిరీస్ ముగింపు కాదని, దానికి మరో సీక్వెన్స్ కూడా ఉంటుందని అధికారికంగా చెప్పాడు. ఆ సిరీస్ ప్రతి 2-3 సంవత్సరాల గ్యాప్‌లో ఓ సినిమా వస్తుందని తెలిపాడు. ప్రస్తుతం ఈ మూవీతో పాటుగా మరిన్ని సినిమాల్లో తాను నటిస్తున్నట్లు తెలిపాడు.
టిల్లు స్క్వేర్‌కి చాలా మంచి క్రేజ్ ఉంది కానీ నిరంతర రీషూట్లు, వాయిదాలు బజ్‌ను కొంతవరకు దెబ్బతీస్తున్నాయి. మరి ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతుందా లేక తర్వాత తేదీకి మారుతుందా అనేది చూడాలి. గతంలో అద్భుతం, నరుడా డోనరుడా చిత్రాలకు దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.