ప్రకాశం: బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కిష్టాపురం గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన ఓ యువకుడు మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్ రఫీగా రైల్వే పోలీసులు గుర్తించారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారీపడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.