ELR: ఉంగుటూరు MHQ ఫీడర్లో మంగళవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని నారాయణపురం ఏఈ శ్రీ రామ్ తెలిపారు. ఆ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉంగుటూరు గ్రామంలో రైల్వే ట్రాక్ ఆవతల నీలాద్రిపురం రోడ్డు వైపు ఉన్నటువంటి ఏరియా, కొత్తగూడెం రోడ్డు ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల సహకరించాలన్నారు.