NRML: ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు కమిషనర్‌కు పలు సూచనలు చేశారు.