VZM: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం విజయనగరంలో 5k వాక్‌థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ఏ.అర్.దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్, హెల్మెట్ ధారణ తదితర అంశాలపై యువతలో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అలాగే మత్తు పదార్ధాల వినియోగం వలన కలిగే నష్టాలను వివరించారు.