NLG: దేవరకొండ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన గురువారం వారి సమస్యలపై సమావేశం నిర్వహించారు. కార్యదర్శి అంకం చంద్రమౌళి,సహా అధ్యక్షుడు గంగిడి దామోదర్ రెడ్డి,ఉపాధ్యక్షుడు ఆకులపల్లి ఐజాక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బకాయి పడిన 5 విడతల కరువు భత్యం, పీ.ఆర్.సీ మంజూరు చేసి 2023 నుంచి బకాయిలు ఒకేసారి ఇవ్వాలన్నారు.