MDCL: బాచుపల్లి నుంచి మియాపూర్ జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ కాకుండా మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాలని, ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్క్ చేయొద్దని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నారు.