GNTR: బాపట్ల జిల్లా బల్లికురవ మండల కేంద్రంలోని మహిళ సమైక్య కార్యాలయం నందు శుక్రవారం మండలంలోని వివోఏలతో సమీక్ష సమావేశం నిర్వహి స్తున్నట్లుగా మండల ఏపిఎం రాజారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులందరూ హాజరవుతారని చెప్పారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం మొదలవుతుందని, కావున మండలంలోని వివోఏలు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని రాజారావు కోరారు.