NDL: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి 98,290 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరింది. దీనితో జలాశయ నీటిమట్టం 875.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 167.87 టీఎంసీల నీటి నిల్వ ఉంది.