మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా హోం మినిస్టర్ మహమూద్ అలీ తన సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్న విషయంపై తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మెండపల్లి గ్రామస్తులు కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. పితృమాసం సందర్భంగా భోజనాలు తిన్న గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. కొందరిని చికిిత్స కోసం పంపగా మరికొందరికి గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
తెలంగాణలో మరో పది రోజుల పాటు భారీ ఎండలు ఉంటాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తుంపర జల్లులు పడే అవకాశం ఉందని, అయితే విపరీతమైన ఉక్కపోతలు ఉంటాయని వెల్లడించింది.
మాముళ్ల కోసం ఎవరైనా వస్తే అండగా ఉండాల్సిన పోలీసులే మాముళ్లు వసూలు చేయడం ప్రారంభించారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ పోలీసులు ఇలా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌కు చికిత్స జరుగుతోందని, కోలుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అంతేకాదు ఇటివల పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు.
సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్‌ను సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. హరిరామ జోగయ్య మాట్లాడుతున్నానని చెప్పి.. మందుల కోసం రూ.3 వేలు పంపించమని అడిగారని వీహెచ్ తెలిపారు.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నత పదవిలో ఉండి సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం బోకే ఇవ్వనందుకే అలా చేస్తారా అంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.