»Shouldnt A Case Be Registered Against The Home Minister Who Beat The Security Personnel Mla Rajasingh
Rajasingh: సిబ్బందిని కొట్టిన హోంమంత్రిపై కేసు నమోదు చేయరా?
మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా హోం మినిస్టర్ మహమూద్ అలీ తన సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్న విషయంపై తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Shouldn't a case be registered against the Home Minister who beat the security personnel? MLA Rajasingh
Rajasingh: తెలంగాణ హోం మినిస్టర్ మహముద్ అలీ(Mahmud Ali)పై నిన్నటి నుంచి విమర్షలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) జన్మదినం కార్యక్రమంలో భాగంగా తన ఇంటికెళ్లి కలిశాడు. ఆ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బందిపై హోంమంత్రి మహమూద్ అలీ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. సమయానికి ఫ్లవర్ బొకే అందించకపోవడంతో సెక్యూరిటీ చెంప చెళ్లుమనిపించారు. ఈ చర్యపై అలీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక సామాజిక మాధ్యమాలల్లో సైతం ఆ వీడియో వైరల్గా మారింది. తాజాగా ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్పందించారు. ఒక సామాన్యుడు చట్టాన్ని ఉల్లంఘిస్తే పోలీసులు వేగంగా స్పందించి హడావిడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని పేర్కొన్నారు. కానీ పోలీసు అధికారిపై చేయి చేసుకున్న మహమూద్ అలీపై ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీలు చర్యలు తీసుకోలేరా అంటూ ప్రశ్నించారు. వీఐపీల రక్షకులుగా ఉండే పోలీసు అధికారులు వారి వ్యక్తిగత పనులు చేయకుంటే చేయి చేసుకుంటారా అని మండిపడ్డారు. దీనిపై సమాధానం చెప్పలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటన విషయంలో మహమూద్ అలీ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండి పడుతున్నారు. గతంలో ఓ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నారు. ఆ వీడియో కూడా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.