Lok Sabha Reults : కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్
మంగళవారం ఎన్నికల ఫలితాలు తెలియనున్ననేపథ్యంలో కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Swearing Ceremony Preparations : సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఫలితాలు మొత్తం మంగళవారం సాయంత్రానికి తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే వారి కోసం ముహూర్తాన్ని ఖరారు చేశారు. జూన్ 9 లేదా 10వ తేదీన కొత్త ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారు. ఇందు కోసం దిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు.
కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారాన్ని(PM Swearing Ceremony ) పెద్ద ఎత్తున జరికపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పతి భవన్లో ఈ వేడుక జరగాల్సి ఉంది. అయితే ఈ వేడుకకు పది వేల మది హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వేదికను మార్చాల్సి రావచ్చా? అన్న కోణంలోనూ ఆలోచిస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు 12 మంది విదేశీ ప్రముఖులు సహా మొత్తం పది వేల మంది హాజరు అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 300 సీట్ల ఆధిక్యంలో ఎన్డీయే కొనసాగుతోంది. ఇండియా కూటమి 204 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగి విజయాలు దక్కితే భాజపా మళ్లీ మూడో సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనంగా కనిపిస్తోంది. మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారా? అన్నది వేచి చూడాలి.