భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇలా ఈసీకి సెక్యూరిటీ పెంచడంతో దేశంలో ఏం జరుగుతుందని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Chief Election Commissioner Rajeev Kumar has 'Z' category security
Rajeev Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. సాయుధ కమాండో దళాలు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయను ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్రం భావించింది. అందుకే ఆయనకు పఠిష్ట భద్రతను కల్పించింది. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఎటువైపు నుంచి ముప్పు పొంచి ఉంది అనేది వెల్లడించలేదు. దీంతో దేశంలో ఏం జరుగుతుందని ప్రతిపక్షపార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
ఐబి చెప్పిన సమాచారంతో తాజాగా హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 35 మంది సిబ్బంది సీఈసీ రక్షణలో ఉంటారు. రాజీవ్ కుమార్ 2020లో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. మే 15, 2022న ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ లాంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలసిందే. ఇది కూడా సీఈసీ భద్రత పెంపునకు కారణం అని తెలుస్తుంది.