»Pandit Keshav Dev Election Campaign With Sandal Garland
Pandit Keshav Dev: చెప్పుల దండతో ఎన్నికల ప్రచారం
లోక్‌సభ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుతో ప్రచారం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పండిట్ కేశవ్ దేవ్ అనే వ్యక్తి ఏడు పాదరక్షలు కట్టిన దండ మెడలో వేసుకుని ప్రచారం చేస్తున్నారు.
Pandit Keshav Dev: ఎన్నికలు ప్రారంభం అవుతున్నాయంటే అభ్యర్థులు ప్రచారానికి ప్రాధాన్యత వహిస్తారు. ఈ క్రమంలో ప్రజలకు గుర్తుండిపోయే విధంగా ప్రచారాలు చేస్తుంటారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుతో ప్రచారం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పండిట్ కేశవ్ దేవ్ అనే వ్యక్తి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే దేవ్‌కు ఎన్నికల సంఘం పాదరక్షల గుర్తును కేటాయించింది. దీంతో ఆయన ఏడు పాదరక్షలు కట్టిన దండ మెడలో వేసుకుని ప్రచారం చేస్తున్నారు.
ఓటర్లకు తను బాగా గుర్తుండిపోవాలని.. ఈ విధంగా ప్రచారం చేస్తున్నానని దేవ్ తెలిపారు. ఇలా ప్రచారం చేయడం వల్ల అందరిలో ఢిపరెంట్‌గా ఉండటం వల్ల ప్రజలకు గుర్తించికుంటారని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్నాయి. అలీగఢ్ నియోజకవర్గానికి రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏడు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్నాయి. దాంతో యూపీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొత్తం ఏడు విడతల్లో కొనసాగనుంది.