»Security Failure At Delhi Airport A Drunk Man Jumped Over The Wall And Ran Onto The Runway
Delhi Airport: విమానాశ్రయంలో భద్రతా వైఫల్యం.. రన్‌వేపైకి దూసుకొచ్చిన ఆకతాయి
భద్రతా సిబ్బంది వైఫల్యంతో ఓ వ్యక్తి విమానాశ్రయంలో రన్‌వేపైకి దేసుకొచ్చాడు. దీంతో పైలెట్ కంగారు పడి అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Delhi Airport: ఢిల్లీ(Delhi) అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌లో మరోసారి భద్రత వైఫల్యం బయట పడింది. ఓ మందుబాబు ఏకంగా రన్‌వేపైకి వచ్చి ఫ్లైట్స్‌కు అడ్డం వెళ్లాడు. అతన్ని గుర్తించిన పైలెట్ వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. జనవరి 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విమానాశ్రయ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) నిర్వహిస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహిరించిన హెడ్ కానిస్టేబుల్‌ను సప్పెండ్ చేశారు.
గోడదూకి రన్‌వేపై దూసుకొచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రన్‌వై తిరుగుతున్న వ్యక్తని ఎయిర్ ఇండియా పైలెట్ గమనించాడు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించాడు. ఏటీసీ ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు చేరవేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అతనిది హర్యానా అని తెలుసుకున్నారు. అనంతరం ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.