భారత సర్వోన్నత న్యాయస్థానం 1950 జనవరి 28న ప్రారంభమైంది. వజ్రోత్సవం సందర్భంగా నిన్న ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. దేశంలోని న్యాయ వ్యవస్థ మొత్తం సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉంటుంది.
Narendra Modi: భారత సర్వోన్నత న్యాయస్థానం 1950 జనవరి 28న ప్రారంభమైంది. వజ్రోత్సవం సందర్భంగా నిన్న ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. దేశంలోని న్యాయ వ్యవస్థ మొత్తం సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆ కోర్టు తలుపులు దేశంలోని చిట్టచివరి వ్యక్తికీ తెరిచి ఉండాలి. తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రక్రియ సుప్రీంకోర్టులో ప్రారంభమైనట్లుగానే మిగతా కోర్టుల్లోనూ త్వరగా అమల్లోకి రావాలి. కోర్టు తీర్పులను సరళమైన భాషలో రాయడంవల్ల సామాన్యులకు మరింత మేలు చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మారుస్తోందని, ఇవి రేపటి భారతాన్ని బలోపేతం చేస్తాయని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నేర న్యాయ బిల్లుల ద్వారా న్యాయ, పోలీసు, దర్యాప్తు వ్యవస్థలు సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. నిన్న ఢిల్లీలో సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను మోదీ ప్రారంభించి సుప్రీంకోర్టు నూతన వెబ్‌సైట్‌తో పాటు, డిజిటల్ రికార్డులు, డిజిటల్ కోర్ట్స్-2.0 ను ఆవిష్కరించారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి సంస్థ, వ్యవస్థ వచ్చే 25 ఏళ్ల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాయన్నారు. ఇప్పుడు చేస్తున్న చట్టాలు రేపటి ఉజ్వల భారతాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు.