హైదరాబాద్ నెహ్రు జూపార్కు(Nehru Zoopark)లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఏనుగు మావటిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయారు. ఏనుగుల సఫారీలో విధుల్లో ఉన్న షాబాజ్ (Shahbaz) (28) అనే మావటిపై ఓ ఏనుగు హఠాత్తుగా దాడి చేసింది. సాధారణంగా ఏనుగుల సఫారీ(Elephant Safari)లో ఐదారుగురు మావటి (Mavaati) లు విధుల్లో ఉంటారు. శనివారం జూపార్క్ 60 సంవత్సరాల వేడుక సందర్భంగా కొంత మంది అక్కడి విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో షాబాజ్ ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఏనుగు ముందుకు దూసుకొచ్చి అతడిని నేలకేసి కొట్టింది. తీవ్రగాయాలై కొనఊపిరితో ఉన్న బాధితుడిని అక్కడి సిబ్బంది డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు