KA Paul: ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈ సారి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ తెలుగోడి సత్తా చాటారు.. ఇప్పుడు తాను అంటున్నారు. శనివారం విశాఖపట్టణంలో పర్యటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడంలో విజయం సాధించామని తెలిపారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు చేయని పనిని తాను చేశానని వివరించారు.
స్టీల్ ప్లాంట్ విక్రయించొద్దని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాను కోరానని వివరించారు. తానొక్కడినే స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నానని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడటం లేదని చెప్పారు. రాష్ట్రంలో నేతలంతా కలిసి ఉంటే.. స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీని మోడీ ఇచ్చేవారని తెలిపారు. కానీ అలా లేమని.. అందుకే రాష్ట్రానికి ఏమీ సాధించడం లేదన్నారు. బీజేపీ అనుసరిస్తోన్న విధానాలకు మాత్రమే తాను వ్యతిరేకిని అని.. ఆ పార్టీకి చెందిన వ్యక్తులకు కాదని కేఏ పాల్ స్పష్టంచేశారు. తాను చెబితే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వింటారని చెప్పకనే చెప్పారు.