Food Poison: అస్వస్థతకు గురైన 70 మంది గ్రామస్తులు..ఎందుకంటే?
మెండపల్లి గ్రామస్తులు కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. పితృమాసం సందర్భంగా భోజనాలు తిన్న గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. కొందరిని చికిిత్స కోసం పంపగా మరికొందరికి గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
Food Poison: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మెండపల్లి గ్రామంలో 70 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని ముండే బలవంత్ లో పితృమాసం సందర్భంగా శుక్రవారం రాత్రి గ్రామస్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో ఆహారం తిన్నప్పటి నుంచి గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దాదాపు 70 మంది ఆ ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాతి రోజు ఉదయం కూడా మరికొందరు గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 108కు సమాచారం అందించగా.. 20 మందిని జిల్లాలో ఉన్న రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరికొందరిని మండలంలోని పీహెచ్‌సీకి అంబులెన్స్‌ల్లో పంపారు. అలాగే మిగిలిన వారికి గ్రామంలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి డాక్టర్ శ్రీకాంత్ చికిత్స అందిస్తున్నారు.