• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష

SDPT: బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి సిద్దిపేట కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన శంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేశారు.

February 25, 2026 / 09:45 PM IST

సెక్రటరికి వినతి ప్రతం అందజేత

WGL: ఉమ్మడి జిల్లాలోని పాలకుర్తి, మహబూబాబాద్ గిరిజన గురుకుల పాఠశాల & కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఇవాళ DSFI ఆధ్వర్యంలో గురుకులాల సెక్రటరీ సీత లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSFI రాష్ట్ర( P) శివ వర్మ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మెనూని అందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

February 25, 2026 / 09:21 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి సాయం

HYD: రేణుక నగర్‌కు చెందిన సత్యనారాయణ పక్షవాతం, గుండెపోటుతో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు షైక్ ఫరీద్, వినీత్ కుమార్ ఆయన కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ గుప్త, ఉమేష్ పాల్గొన్నారు.

February 25, 2026 / 09:21 PM IST

డైరీలో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

JN: రఘునాథ్ పల్లి మండలం గోవర్ధనగిరి శక్తి డైరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. కూలింగ్ ఛాంబర్లోని కంప్రెసర్ పేలడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాజు ముక్కలు శరీరంలోకి చొచ్చుకుపోవడంతో బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 09:16 PM IST

పీఎం విశ్వకర్మపై అవగాహన కార్యక్రమం

WNP: పానగల్ మండలంలోని అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఔత్సాహిక పాల్ సమీక వేతలకు విశ్వకర్మ, పీఎం ఈజిపి స్కీంలపై అవగాహన కల్పించారు. జనరల్ మేనేజర్ జ్యోతి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు చేతివృత్తులు చేసుకునే వారికి ఉపయోగపడుతుందని తెలిపారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 09:06 PM IST

సబ్ కలెక్టర్‌కు సర్పంచ్ ఫిర్యాదు

KMR: ప్రభుత్వ కార్యకలాపాలలో గ్రామ సర్పంచ్‌కు పాలకవర్గంకు భాగస్వాములను చేస్తూ అధికారులు సర్పంచ్‌లకు ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు ఉన్న డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ సర్పంచులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు.

February 25, 2026 / 09:05 PM IST

మొదటి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం.. 14 మంది గైర్హాజరు

KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర (సెట్ “బీ”) తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 246 మందికి 243 మంది, ఆదర్శ కళాశాల కేంద్రంలో 219 మందికి 208 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.

February 25, 2026 / 08:59 PM IST

గ్రామ సర్పంచ్‌లకి ప్రశంసా పత్రం అందజేత

PDPL: పెద్దపల్లి మదర్ థెరిసా కాలేజీలో నిర్వహించిన 5 రోజుల శిక్షణా కార్యక్రమం అనంతరం గ్రామ సర్పంచ్‌లకు ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీవో షబ్బీర్ చేతుల మీదుగా మంథని(M) గుంజపడుగుకి చెందిన దండవేన సంధ్యకి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై శిక్షణ పొందిన సర్పంచ్‌లకి అధికారులు అభినందనలు తెలిపారు.

February 25, 2026 / 08:53 PM IST

‘మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధించాలి’

ADB: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బెల్లూరు కాలనీలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోకో పిట్ యూనిట్‌ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూషతో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ రాజు తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 08:50 PM IST

‘ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలి’

NRML: ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమావేశంలో వారు మాట్లాడతూ.. అవగాహన కార్యక్రమాలు, వర్క్‌ షాప్‌లు నిర్వహించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు.

February 25, 2026 / 08:50 PM IST

పలువురి ప్రశంసలు అందుకున్న ఎస్సై హరిత

KMM: ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో పోలీసులు బుధవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒంటరిగా తిరుగుతున్న పదేళ్ల బాలుడిని ఎస్సై హరిత చేరదీసి విచారించారు. తన పేరు కట్టా పెనుకొండయ్య, జగ్గయ్య పేట అని చెప్పాడు. మిగతా వివరాలు కూడా ఎస్ఐ హరిత తెలుసుకున్నారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తల్లి బిడ్డను కలిపారు. దీంతో పలువురు ఆమెని ప్రశంసించారు.

February 25, 2026 / 08:48 PM IST

బొమ్మరెడ్డి గూడెంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

SRD: చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెం గ్రామంలో బుధవారం హైదరాబాద్ బాచుపల్లి మమత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత విద్య శిబిరం నిర్వహించారు. బీపీ షుగర్ తన అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత శిబిరంలో 90 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 08:47 PM IST

సేవలాల్ ఉత్సవాల్లో డాన్స్ చేసిన.. రాష్ట్ర మంత్రి

WGL: పట్టణ కేంద్రంలోని కాశిబుగ్గ SR నగర్‌లో బుధవారం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క లంబాడి మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను కొనసాగించాలన్నారు.

February 25, 2026 / 08:46 PM IST

ప్రచార రథాన్ని ప్రారంభించిన CP

HNK: బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ షేర్ ఎన్టీవో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార రథాన్ని CP సన్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని CP అన్నారు.

February 25, 2026 / 08:46 PM IST

శ్రీ దత్తాత్రేయ ఆలయ ప్రధాన అర్చకులు మృతి

SRCL: బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బుధవారం శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రధాన అర్చకులు శ్రీ సంకెపెల్లి చంద్రమౌళి పంతులు మృతి చెందారు. ఆయన స్వామి వారికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని వరదవెల్లి గ్రామ ప్రజలు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

February 25, 2026 / 08:46 PM IST