»Jp Nadda Is Certain That Bts Will Fall In The Next Assembly Elections 2023
JP Nadda: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పతనం ఖాయం
తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అంతేకాదు ఇటివల పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు.
JP Nadda is certain that BTS will fall in the next assembly elections 2023
రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తు, ప్రజలు, అభివృద్ధి కోసం జరిగే పోరాటమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) శుక్రవారం అన్నారు. ఇవి దేశంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో నడ్డా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కి ఇదే నా సందేశం. మీకు సిగ్గు లేదా.. రజాకార్లతో చేతులు కలిపుతారా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రజాకార్లు ఏం చేశారో ప్రజలు మర్చిపోలేదన్నారు.
Every karyakarta of BJP can proudly assert that BJP offers solutions for development at regional and national levels.
జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌తో సహా దేశంలోని అన్ని పార్టీలూ కుటుంబ పార్టీలేనని గుర్తు చేశారు. వారు తమ అవసరాలకు అనుగుణంగా తమ స్టాండ్లను, సూత్రాలను మార్చుకుంటారని పేర్కొన్నారు. కానీ ఆవిర్భావం నుంచి కేవలం బీజేపీ మాత్రమే తమ సూత్రాలు, విధానాల నుంచి తప్పుకోలేదని నడ్డా స్పష్టం చేశారు. నగర సమీపంలోని ఓ ప్రైవేట్ వేదికగా జరిగిన బీజేపీ(BJP) రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నడ్డా ప్రసంగించారు. ప్రచారం విషయంలో రెండు ఆలోచనలు ఉండకూడదని అన్ని జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలకు ఈ సందర్భంగా తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు చేసిన ప్రతి విషయం ప్రజలకు తెలియజేయాలని కోరారు. అంతేకాదు గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. BRS నాయకుల అవినీతి గురించి ఏం చెప్పాలని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం యువత జీవితాలతో ఆడుకుందన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాలను లీక్ చేసి లక్షల మంది యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందన్నారు. బీజేపీ, మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ కార్యక్రమాల వల్ల తెలంగాణ ఎంతగా లాభపడిందో ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణకు చెందిన 2 కోట్ల మందికి 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమలతో పాటు కేంద్రం నుంచి కిలో పప్పులు, 2.5 లక్షల మందికి ఇళ్లు ఇచ్చామని నడ్డా వివరించారు. పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు స్వచ్ఛ భారత్ కింద 31 లక్షల మరుగుదొడ్లు అందించినట్లు చెప్పారు. తెలంగాణ గెలిస్తే దేశం గెలుస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో కమలం వికసించేలా చేయాలని..తెలంగాణ భవిష్యత్తును మార్చడం బిజెపితోనే సాధ్యమవుతుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు.