కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ (Chikoti Praveen) ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ సమక్షంలో చికోటి బిజెపి (BJP) తీర్థం పుచ్చుకున్నారు.మాజీ ఎమ్మెల్సీ రాంచందచర్రావు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా గౌతం రావు(Gautam Rao)..ప్రవీణ్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశవిదేశాలలో గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినో(Casino)లను నిర్వహించినందుకు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ ఈడీ (ED) విచారణ ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్ ప్రవేశాన్ని బిజెపి నాయకులలో ఒక వర్గం వ్యతిరేకించింది.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఫలించలేదు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరాల్సి ఉండగా.. తీరా చికోటీ బీజేపీ కార్యాలయానికి చేరుకునే వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆయన ఆఫీస్ నుండి వెళ్లిపోవడంతో చికోటీ చేరిక నిలిచిపోయింది. ఈడీ కేసులు, క్యాసినో వ్యహరంలో కేసులు ఉండటంతో చికోటీ చేరికను తెలంగాణ బీజేపీలోని ఓ వర్గం వ్యతిరేకించిందని.. దీనితోనే అప్పుడు చికోటి జాయినింగ్ అర్థాంతరంగా ఆగిపోయిందని ప్రచారం జరిగింది.
ఈ పరిణామం తర్వాత చికోటీ సైతం ఓ వీడియో రిలీజ్.. తన ఆవేదనను వెళ్లగక్కారు.చేర్చకుంటామని చెప్పి.. చర్చలు ముగిసి.. తీరా పార్టీలో చేరే చివరి క్షణంలో అడ్డుకోవడం అన్యాయమన్నారు. మరోసారి బీజేపీ పెద్దలతో చికోటీ చర్చలు జరపగా.. ఎట్టకేలకు చేరికకు గ్రీన్ సిగ్నల్ (Green signal) లభించింది.తిరునాల్లల్లో తప్పి పోయిన పిలగాడు మాదిరిగా తిరిగి తిరిగి తల్లి వొడికి చేరినట్లుగా ఉందన్నారు. బీజేపీ పటిష్టత కోసం పని చేస్తానని అన్నారు. అన్ని పార్టీలకు తెలంగాణలో అవకాశం ఇచ్చారని తెలిపారు. ప్రజలారా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నానన్నారు.