»America Headed For Recession Impact On India Axis Bank Chief Economist Neelkanth Mishra
America recession: ఆర్థికమాంద్యం దిశగా అమెరికా..ఇండియాపై తీవ్ర ప్రభావం!
ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించే అమెరికా ఈ ఏడాదిలో తీవ్ర ఆర్థికమాంద్యమాన్ని ఎదుర్కొబోతోంది అని ప్రముఖ ఎకనామిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. యూఎస్ఏ వలన భారతదేశానికి చాల నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
America headed for recession. Impact on India Axis Bank Chief Economist Neelkanth Mishra
America recession: త్వరలోనే అమెరికా(America) తీవ్ర ఆర్థిక మాంద్యమాన్ని(recession) ఎదుర్కొబోతుందని ఇండియన్ టాప్ ఎకనామిస్టుల్లో ఒకరైన యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంఠ్ మిశ్రా(Neelkanth Mishra) హెచ్చరించారు. ఇది ఇండియన్ జీడీపీలో ప్రధాన భాగమైన సర్వీస్ సెక్టార్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఇండియన్ బాండ్, ఈక్విటీ మార్కెట్లపై యూఎస్ రెసిషన్ తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇండియాతో పాటు పలు దేశాలపై ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు.
ఈ సంవత్సరంలో అమెరికా ఆర్థికమాంద్యంలోకి జారుకోబోతోందని నీలకంఠ్ మిశ్రా తెలిపారు. యూఎస్ ఆర్థిక లోటు ఆ దేశ జీడీపీలో ఈ ఏడాది మరో 4 శాతం పెరిగిందని చెప్పారు. ఒకవేళ వచ్చే ఏడాది అమెరికా తన ఆర్ఠిక లోటును ఫ్లాట్ గా ఉంచినా..ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యలోకి వెళుతుందని, ఇదే అతి పెద్ద సమస్య అని తెలిపారు. ఈ కారణంగా యూఎస్ బాండ్లు కొనేందుకు ఎవరూ వేచి ఆసక్తి చూపడం లేదని, కీలక వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని, దీంతో ప్రపంచ వ్యాప్త డిమాండ్ పై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించారు.
దీంతో ఇండియాపై నాలుగు విధాలుగా ప్రభావం చూపుతుందని నీలకంఠ్ మిశ్రా తెలిపారు. సర్వీస్ సెక్టార్ మొదటి ప్రభావం పడుతుందని అన్నారు. ఇప్పటికే సర్వీసెస్ వృద్ధి రేటు నెమ్మదించిందని పేర్కొన్నారు. ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ, బిజినెస్ సర్వీసెస్ ఎగుమతులు దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ఇండియన్ ఎక్స్ పోర్ట్స్ లో 10 శాతం సర్వీసెస్ ఎక్స్ పోర్ట్స్ ఉన్నాయన్నారు. ఈ సెక్టార్ పతనమైతే మన జీడీపీ 1 శాతం వృద్ధి రేటును కోల్పోతుందన్నారు.
అలాగే వస్తు ఎగుమతులపై ప్రభావం పడుతుందని మిశ్రా చెప్పారు. మన దేశ వస్తు ఎగుమతులకు డిమాండ్ పడిపోతుందని తెలిపారు. ఇప్పటికే చైనా, జపాన్, యూరోపియన్ దేశాల ఎగుమతులపై ప్రభావం ప్రారంభమయిందని, త్వరలో ఇండియా ఎదుర్కొబోతుందని, దీని ద్వారా ఆయా దేశాల ఎగుమతులు అన్ని ఇండియాలో డంప్ అవుతయన్నారు. మన దక్కర జనభా ఎక్కువగా ఉండడం వలన అన్ని దేశాలు మన మార్కెట్‌పై టార్గెట్ చేస్తారని పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి ఇండియా బయటపడాలంటే.. మాక్రోఎకనామిక్ స్థిరత్వంపై దృష్టిసారించాలని మిశ్రా సూచించారు. వచ్చే ఏడాది లేదా ఒకటిన్నర సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ భారీ కుదుపులకు గురవుతాయని మిశ్రా అన్నారు. మనమంతా అదృష్టవంతులైతే ఏడాదిన్నరలో సంక్షోభం ముగుస్తుందని..లేకపోతే, సంక్షోభం ఐదేళ్ల పాటు కొనసాగొచ్చని తెలిపారు. ఇండియన్ ఎకానమీ విషయానికి వస్తే మరో 5 నుంచి 7 ఏళ్ల పాటు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.