ISRO: పరీక్షించేందుకు గగన్‌యాన్ రెడీ.. ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో
చంద్రయాన్3 సక్సెస్ తర్వాత ఇస్రో గగన్‌యాన్ మిషన్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగంలోని అతి ముఖ్యమైన టెస్ట్‌ను నిర్వహించనుంది. అది సక్సెస్ అయితే గగన్‌యాన్ మరింత సులభతరం కానుంది.
అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని (Austronauts) పంపేందుకు ఇస్రో (ISRO) సిద్ధమైంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇస్రో గగన్‌యాన్ (Gaganyaan Crew Module) ప్రాజెక్ట్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్‌లో కీలకమైన క్రూ మాడ్యూల్ టెస్ట్ (Crew Module Test)కు ఇస్రో సిద్ధమైంది. నింగిలోకి వెళ్లి వచ్చే వ్యోమగాములకు చెందిన ఈ క్రూ మాడ్యూల్‌ను ఇస్రో పరీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిషన్‌కు చెందిన టెస్ట్ వెహికల్ అయిన అబోర్ట్ మిషన్-1ను ఇస్రో సిద్దం చేసింది.
ఇస్రో షేర్ చేసిన గగన్‌యాన్ ఫోటోలు:
Mission Gaganyaan: ISRO to commence unmanned flight tests for the Gaganyaan mission.
తాజాగా ఈ మాడ్యూల్‌కు చెందిన ఫోటోలను ఇస్రో (ISRO) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ మిషన్‌ను టెస్టింగ్ కోసం నింగిలోకి పంపి, మళ్లీ భూమిపైకి దించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ పరీక్ష సమయంలో ఆ మాడ్యూల్ బంగాళాఖాతంలో ల్యాండ్ అవుతుందని, సముద్రం నుంచి ఇండియన్ నేవీ ఆ మాడ్యూల్ మెషన్‌ను శ్రీహరికోట (Sriharikota)కు తీసుకురానుందని ఇస్రో వెల్లడించింది.
ప్రస్తుతం ఈ టీవీ-డీ1 మాడ్యూల్ నిర్మాణం ఆఖరి దశకు చేరుకుందని, ఆ మాడ్యూల్ 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా మళ్లీ భూమిపైకి రానుందని ఇస్రో (ISRO) తెలిపింది. పారాచూట్ల సాయంతో ఈ మిషన్ నింగి నుంచి దిగుతుందని, శ్రీహరికోట (Sriharokota) నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని సముద్ర ప్రాంతంలో ఆ మాడ్యూల్ ల్యాండ్ కానున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ టెస్ట్ సక్సెస్ అయితే గగన్‌యాన్ (Gaganyaan) సులభతరం కానుంది.