»Iranian Activist Narges Mohammadi Has Won The Nobel Peace Prize 2023
Nobel Peace Prize 2023: గెల్చుకున్న ఇరాన్ కార్యకర్త నర్గేస్
ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఇరాన్ కార్యకర్త నర్గెస్ మొహమ్మదీ(Narges Mohammadi)కి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ఏకంగా 2023 శాంతి నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ అకాడమీ శుక్రవారం ప్రకటించింది.
Iranian activist Narges Mohammadi has won the Nobel Peace Prize 2023
ఇరాన్ కార్యకర్త(Iranian activist) నర్గెస్ మొహమ్మదీ(Narges Mohammadi)కి 2023 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ మేరకు స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ అకాడమీ శుక్రవారం స్పష్టం చేసింది. అయితే ఆమె ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకుగాను ప్రకటించినట్లు తెలిపింది. దీంతోపాటు ఆమె అందరికీ మానవ హక్కులు, స్వేచ్ఛ వంటి వాటి కోసం పోరాటం చేసినట్లు గుర్తు చేసింది.
ఈ పోరాటంలో భాగంగా ఆమె 13 సార్లు అరెస్టు చేయబడింది. ఐదుసార్లు దోషిగా నిర్ధారించబడింది. మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 154 కొరడా దెబ్బలు కూడా అనుభవించింది. ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ హక్కుల సంస్థ ప్రకారం ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో బహుళ శిక్షలను అనుభవిస్తున్నారు. నర్గేస్ మొహమ్మదీ ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా “ప్రచారం చేసినందుకు” అభియోగాలను కూడా ఎదుర్కొంది.
నార్గేస్ మొహమ్మదీకి ఈ అవార్డు అందించడంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ(nobel committee) సామాజిక న్యాయం, మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేసే అంశాలను ప్రస్తావించింది. అకాడమీ ప్రకారం శాంతి బహుమతి గ్రహీతలు వారి స్వదేశాలలో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తారు. అనేక సంవత్సరాలుగా వీరు అధికారాన్ని విమర్శించే హక్కు, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షేందుకు పాటుపడ్డారు. యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని ప్రస్తావించడంలో వారు అద్భుతమైన ప్రయత్నం చేశారు. శాంతి, ప్రజాస్వామ్యం, పౌర సమాజం కోసం వారి ప్రాముఖ్యతను చాటి చెప్పారు.