ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేసిన ఈడీ ఈరోజు కోర్టుకు హాజరు పరిచింది. తనను అక్రమంగా అరెస్టు చేసినట్లు కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేసింది.
Kavitha: తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటిపై ఈడీ అధికారులు, ఐటీ అధికారులు సోదాలు జరిపారు. దాదాపు 5 గంటలు రైడ్స్ తరువాత మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్టు వ్యారెంటీని ఇచ్చి కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈ రోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. కోర్టు ఆవరణంలో కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ అక్రమమని పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తా అని పేర్కొన్నారు. కోర్టులో కవిత న్యాయవాదులు, ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు.
లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్‌లో కవితను ప్రధాన వ్యక్తిగా ఈడీ పేర్కొంది. ఆమెను విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని కోర్టుకు అప్పిల్ చేసింది. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. కవిత అరెస్ట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.