»Kavita Arrested Ktr Expressed His Anger Against The Authorities
KTR: కవిత అరెస్ట్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్
సుప్రీంకోర్డు అరెస్ట్ చేయమని చెప్పిన తరువాత కవితను ఎలా అరెస్ట్ చేస్తారని అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని అరెస్ట్ చేయాడానికే ఈడీ శుక్రవారం వచ్చారని అన్నారు.
Kavita arrested.. KTR expressed his anger against the authorities
KTR: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా ఈడీ అధికారులు, ఐటీ అధికారలు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో జాయింట్ సోదాలు జరిపారు. దాదాపు 4 గంటలు సోదాలు చేసి చివరికి కవితను అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలె కేటీఆర్, హారీష్ రావు కవిత ఇంటికి చేరుకున్నారు. సోదాలు ముగిసిన తరువాత ఇంట్లోకి అనుమతించలేదని, సొంత కుటుంబాన్ని కూడా ఇంట్లోకి పంపించకపోవడం ఏంటని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను ప్రశ్నించాడు. సుప్రీంకోర్డు అరెస్ట్ చేయమని చెప్పినా కూడా అధికారులు ఎందుకు అరెస్ట్ చేశారని అడిగారు.
అధికారులు భానుప్రియా, మీనాలతో మాట్లాడుతూ.. మీరు చట్టపరంగా అరెస్ట్ చేయలేదని తరువాత చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా మీరు అరెస్ట్ చేయడం ఏంటని, ఉన్నత న్యాయస్థానం మాటలను పట్టించుకోవడం లేదని అన్నారు. మీరు అరెస్ట్ చేయాలను ఉద్దేశంతోటే శుక్రవారం వచ్చారని అన్నారు. ఇక కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీకి, మోడికి వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.