»It Raids In Brs Mlc Kavitha House With Ed Officials
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
CBI summons Kavitha to appear for investigation in liquor scam
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాల ఖాతాలు, సంబంధిత లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని కవిత నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఐటీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది. రేపు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. అంతకు ముందు రోజు కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే ఆమెను ప్రశ్నించారు. ఆ తర్వాత సీబీఐ ఆమెకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు ఐటీ అధికారులు రంగ ప్రవేశం చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.