CM Revanth Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదే సమయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. దీంతో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది వరకే చాలా మంది ముఖ్య నేతలు పార్టీ వీడిన సంగతి తెలిసిందూ. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక రకమైన సందిగ్దత ఏర్పడింది. అయితే ఆయన మాత్రం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని నియోజకవర్గాలలో దానం నాగేందర్ ముఖ్య నేతగా ఉన్నారు. దానం నాగేందర్ 1994,1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రేపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలవడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం కొత్త రాజకీయ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి, కర్ణాటక ఉపరాష్ట్రపతి డీకే శివకుమార్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలువడంతో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఇక దానం రాజకీయ ప్రస్థానంలో గెలుపోటము చూశారు. 2009లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. దాంతో వైఎస్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఆ తరువాత 2018లో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లోకిిి వచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అలాగే 2023లో జరిగిన అసంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారా అదే అనేది అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.