BSP, BRS in alliance in Lok Sabha elections. BSP will contest 2 seats
Lok Sabha elections: దేశం మొత్తం లోక్సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని చూపించాలని ప్రయత్నిస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తుంది. అందుకే రాష్ట్రంలో ఈ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీ తెలవిగా ప్రవర్తిస్తోంది. తమతో నడిచే పార్టీలను కలుపుకుపోయే క్రమంలో బీఎస్పీ పార్టీతో పొత్తుకుదిర్చింది.
రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తును అంగీకరించారు. దీంతో ఆయన పార్టీ శ్రేణులు సైతం హర్షం వ్యక్తం చేశారు. తాజాగా సీట్ల పంపిణి విషయం కూడా తేలిపోయింది. తెలంగాణలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 2 స్థానాలు బీఎస్పీ, మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనున్నాయి. అందులో నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ పోటీ చేయనున్నారు. అలాగే హైదరాబాద్ స్థానం నుంచి మరో బీఎస్పీ అభ్యర్థి రంగంలో దిగనున్నారు. అయితే గత ఎన్నికల్లో సిరిపురం అసెంబ్లీ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసి ఓటమి చెందారు. ఇక మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.