ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కవితకు మళ్లీ షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.
MLC Kavitha: In liquor scam case.. Kavitha's judicial remand extended
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై ఈరోజ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈనేపథ్యంలో కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కవిత ఛార్జ్‌షీట్ పరిగణలోకి తీసుకోవడంపై విచారణకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మే 20కి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేశారు. కానీ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ కేసులో కవితదే కీలక పాత్ర అని.. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసి ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అందుకే ఆమెపై ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్లో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన సూత్రధారి, పాత్రధారి కవితే అని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కవితతో పాటు మరోనలుగురిపై ఈడీ అధికారులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు.