CM Revanth Reddy: ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల పాలనలో వంద సంవత్సరాలకు సరిపడా కేసీఆర్ ప్రభుత్వం విధ్యంసం చేసింది. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పలోకి దింపిందని రేవంత్ రెడ్డి అన్నారు. మా వంద రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చింది. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే కవిత అరెస్టు విషయంపై రేవంత్ స్పందించారు.
కవిత అరెస్టును కేసీఆర్ ఖండించలేదు. ఆయన మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఆమె అరెస్టుపై కేసీఆర్, నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు. దాని వెనుక ఉన్న వ్యూహం ఏంటన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు. కానీ నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారన్నారు. కేసీఆర్ కుటుంబం, బీజేపీ మద్యం కుంభకోణాన్ని నడిపించారన్నారు. కవిత అరెస్టు బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అన్నారు. 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మమ్మల్ని దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.