MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. అయితే కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో కోర్డు 7 రోజుల కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఉంటారు. 23న తిరిగి మళ్లీ కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.