»Union Minister Amit Shah Challenges Cm Revanth Reddy
Amit Shah : సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు.
Amit Shah said Modi government open schools congress government will bring liquor shop in chhattisgarh
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన స్కాంల లిస్ట్ పంపిస్తా.. అవినీతి జరిగిందా లేదా రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని దేశంలో ఏకైక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీనే అన్నారు. సీఎంగా చేసినప్పుడు కూడా మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదన్నారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ ఇచ్చింది మోడీ సర్కారని అమిత్ షా పొగిడారు. కేంద్రంలో ఈసారి 400 సీట్లు రావాలి.. తెలంగాణ నుంచి 12కి పైగా స్థానాలు గెలిపించాలని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకవైపు.. బీజేపీ మరో వైపు అని అమిత్ షా చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం అజెండా ఒక్కటే అని ధ్వజమెత్తారు. మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడమే ముగ్గురి లక్ష్యం అని దుయ్యబట్టారు. మతతత్వ పార్టీ ఎంఐఎం చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు అమిత్ షా. అధికారంలో రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మజ్లిస్ గుప్పిట్లో ఉన్నాయని చెప్పిన అమిత్ షా.. ఈ రెండు పార్టీలతో నిజాం పాలన నుంచి విముక్తి తెలంగాణ సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు రక్షణ లభించిందని అమిత్ షా పేర్కొన్నారు. మోడీ పాలనలో దేశం సురక్షితంగా ఉంది. CAA తీసుకొచ్చి మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు మోడీ ప్రభుత్వం పౌరసత్వం ఇస్తోంది. సీఏఏ దేశ వ్యతిరేక శక్తులకు తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదని.. సాధారణ శరణార్థులకు సీఏఏ వ్యతిరేకం కాదని అన్నారు. మోడీ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. సోనియాగాంధీకి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం, కేసీఆర్ కు కేటీఆర్ ను సీఎం చేయడమే లక్ష్యమన్నారు. దేశంలో బీజేపీ మినహా అన్ని పార్టీలు కుటుంబాల కోసమేనన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే మోదీ లక్ష్యమని అమిత్ షా అన్నారు.