• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

SRPT: ఆత్మకూరు మండలం కోటి నాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

March 6, 2026 / 01:17 PM IST

‘మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి’

VKB: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతతో కృషి చేయాలని వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ కోరారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్‌లో వాకర్స్‌కు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిండు ప్రాణాలను కోల్పోయి భవిష్యత్తును కోల్పోతుందన్నారు.

March 6, 2026 / 01:16 PM IST

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ

BDK: అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యచరణ పై ఎంపీడీవో ముత్యాల రావు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ ప్రగతి ప్రణాళిక మీద మార్చి 6 నుండి జూన్ 12 వరకు చేయవలసిన పనులు మీద తగు సూచనలు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మీద ఈ సమావేశానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.

March 6, 2026 / 01:16 PM IST

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం: ప్రిన్సిపల్

GDWL: నేటితరం విద్యార్థినులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి అని ప్రిన్సిపాల్ డా. A. మీనాక్షి పిలుపునిచ్చారు. శుక్రవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎన్ఎస్ఎస్ (NSS), ఎకో క్లబ్ ఆధ్వర్యంలో క్లీన్ & గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 6, 2026 / 01:15 PM IST

మంత్రిని కలిసిన కలెక్టర్ ఆదర్శ్ సురభి

WNP: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలోని పలు పరిపాలన, అభివృద్ధి అంశాలపై కలెక్టర్ మంత్రితో మాట్లాడారు.

March 6, 2026 / 01:15 PM IST

వార్డు అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన వీరేష్ యాదవ్ను శుక్రవారం స్థానిక ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, నేతలు తదితరులు ఉన్నారు.

March 6, 2026 / 01:13 PM IST

ప్రజా పాలన సన్నాహక సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

KMM: ఉమ్మడి జిల్లాలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలుపై నిర్వహించిన కీలక సన్నాహక సమావేశానికి వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణను వైరా నియోజకవర్గంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

March 6, 2026 / 01:12 PM IST

జాతీయ అవార్డుకు ఎంపికైన చెల్పూర్ వాసి

BHPL: గణపురం (M) చెల్పూర్ గ్రామానికి చెందిన నర్సయ్య ప్రతిష్ఠాత్మక ‘కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ అవార్డు’కు ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ (BSA) ఆధ్వర్యంలో ఈ నెల 15న తిరుపతిలో జరిగే కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు రాధాకృష్ణ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షుడిగా నర్సయ్య అందిస్తున్న సేపులకు ఈ గుర్తింపు లభించింది

March 6, 2026 / 01:10 PM IST

‘ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి’

RR: షాద్‌నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమాన్ని MLA వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి, ప్రజాసేవల మెరుగుదలే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.

March 6, 2026 / 01:08 PM IST

జాతీయ స్థాయి సెమినార్ కరపత్రాల ఆవిష్కరణ

KNR: SRR ప్రభుత్వ కళాశాలలోని జంతుశాస్త్ర ఆధ్వర్యంలో మార్చి 30, 31 తేదీల్లో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించానన్నారు. దీనికి సంబంధించి కరపత్రాన్ని శుక్రవారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, జీవవైద్య సంరక్షణ పైన జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు.

March 6, 2026 / 01:05 PM IST

‘పెండింగ్ ఫైళ్లను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలి’

ASF: ఆసిఫాబాద్ MPDO కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ ఫైళ్లను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని MPDO ఆదేశించారు. అనంతరం కార్యాలయ పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దన్నారు.

March 6, 2026 / 01:02 PM IST

మాజీ ఎమ్మెల్యేని సన్మానించిన ఎర్రబెల్లి

WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులను సన్మానించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాసేపు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి చర్చించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

March 6, 2026 / 01:02 PM IST

పోస్టల్ ఏజెంట్ల మధ్య ఘర్షణ.. కేసు నమోదు

ఖమ్మం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఏజెంట్ల మధ్య మార్చి 4వ తేదీన జరిగిన గొడవలో టీ. చంద్రశేఖర్ (53) అనే పోస్టల్ ఏజెంట్‌పై తోటి ఏజెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి ముఖానికి గాయాలవ్వగా, ఖమ్మం వన్ టౌన్ ఎస్సై రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి నుంచి “ఆన్ సైట్” ఫిర్యాదును స్వీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 6, 2026 / 01:00 PM IST

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక విజయవంతంగా అమలు చేయ్యాలి’

MBNR: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 3వ విడత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర్ రాజానర్సింహా అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

March 6, 2026 / 12:55 PM IST

నిరుపేద విద్యార్థులకు ఆర్థిక భరోసా

సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు పంతం చక్రపాణి, పంతం రవి కుటుంబ సభ్యులు రూ.1,05,000 ఆర్థిక సహాయం అందజేశారు. మొత్తం 21 మంది విద్యార్థులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేశారు. మార్కండేయ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టకు రూ.51,000 విరాళం ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చక్రపాణి అన్నారు. అనంతరం వారిని ఆ సంఘం సభ్యలు సన్మానించారు.

March 6, 2026 / 12:54 PM IST