JGL: ఈనెల 3న రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నందున ఆ రోజు ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టులో నిర్వహించే గిరి ప్రదక్షిణను గ్రహణానికి ముందే పూర్తి చేసుకుందామని గిరి ప్రదక్షిణ ప్రారంభికులు సురేష్ ఆత్మారాం పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభించి, 07:30 లోపు పూర్తి చేసుకుందామన్నారు. కావున గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సహకరించాలన్నారు.
KNR: గంగాధర మండలం గర్శకుర్తిలో ఘనంగా వరల్డ్ సివిల్ రైట్స్‌డేను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి భారత సైన్యంలో పని చేసిన, ప్రస్తుతం పని చేస్తున్న వారికి, వారి తల్లిదండ్రులను స్థానిక సరస్వతి హైస్కూల్‌లో ఓ ట్రస్ట్ వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డా.రఘరామన్, గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు పాల్గొన్నారు.
SRCL: నోరూరించే ఆపిల్ పండ్లు కాశ్మీర్లోనే కాకుండా సిరిసిల్లలో కూడా పండుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్కు చెందిన విజయ్ బాబు తన ఇంటి ఆవరణలో సీజీజీఎం జాతికి చెందిన జావా ఆపిల్ మొక్కను నాటాడు. ఆ చెట్టు పూతలు పూయడమే కాకుండా ప్రస్తుతం కాయలు కూడా కాస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆపిల్ సాగుకు అనువైన ప్రాంతం కాదనే అభిప్రాయం ఉండేదని వారు తెలిపారు.
WGL: నెక్కొండ మండలం మడిపల్లి GP కార్యదర్శి రజియా GP నిధులు దుర్వినియోగం చేసినట్లు సర్పంచ్ అనూష DLPOకు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సర్పంచ్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగం, సంతకాల ఉదంతం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి- మంచిర్యాల్ జిల్లాలలో ఏప్రిల్-1 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదన్నారు. అలాగే డ్రోన్లు, డీజే సౌండ్స్ కు ఎలాంటి అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంగారెడ్డిలో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యా కమిషన్ నివేదిక పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ నివేదిక ఉపాధ్యాయులను కించపరిచేలా ఉందని మండిపడ్డారు. ఉపాధ్యాయ వ్యతిరేక సిఫార్సులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
MBNR: 2026-27 విద్యా సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మోడల్ స్పోర్ట్స్/వాటర్ స్పోర్ట్స్ అకాడమీల 5వ తరగతి ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె. జనార్దన్ తెలిపారు. 31-08-2026 నాటికి 9-11 ఏళ్లు వయస్సు ఉండి, ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న వారు అర్హులన్నారు.
KNR:హోలీ పండుగ సందర్భంగా మార్చి 2న జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్, కార్యాలయానికి సెలవు ప్రకటించారు. అలాగే కమిషన్ దారులు, ఖరీదారులు, కార్మికుల అభ్యర్థన మేరకు మార్చి 4న కూడా మార్కెట్ యార్డు సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 5 గురువారం నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
SDPT: కలెక్టరేట్లో శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ హైమావతి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా, రైతులకు అండగా ఉండేలా ‘భూభారతి’ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. యాజమాన్యాలకు నమ్మకం కలిగేలా సర్వేయర్లు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకమన్నరు.
BHNG: ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ మరియు పదిమంది వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష ఆదరణ లభించిందని సర్పంచ్ అనిల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం గ్రామంలో నిర్వహించామని తెలిపారు.
WNP: బహుజన రాజ్యాధికారానికి బాటలు వేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పెబ్బేరు మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆదివారం అన్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. 17వ శతాబ్దంలోనే సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీశాలి పాపన్న చరిత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
KMM: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా బార్ కౌన్సిల్ బంజారా న్యాయవాదులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బంజారా న్యాయవాదుల సమస్యలు, స్థానికంగా బంజారా సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. అనంతరం న్యాయవాదులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.
MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలో ఆదివారం సురేష్ ఆధ్వర్యంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా CITU జిల్లా కార్యదర్శి రాజేందర్ హాజరై, మాట్లాడారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం కలిగించే జీవో 51ని సవరించాలని, MPW విధానాన్ని రద్దు చేయాలన్నారు.
నిజామాబాద్ జిల్లాలోనీ ధర్పల్లి మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో 2026 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల ప్రవేశ దరఖాస్తు గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
VKB: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం పట్టణంలోని తేజ ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ అధికారులు, సిబ్బందికి బందోబస్తుపై కీలక సూచనలు చేశారు.