• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్రహణం వేళ దర్శనాలపై మార్పులు

BDK: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో దర్శన సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చి, తరువాత ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం పూర్తయ్యాక శుద్ధి పూజల అనంతరం దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి.

March 1, 2026 / 07:23 AM IST

ఎలక్ట్రిక్ వాటర్ వీల్స్ అందజేసిన కేంద్ర మంత్రి

KNR: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఛైర్మన్ మనోజ్ కుమార్ శనివారం హైదరాబాదులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కుమ్మరి వృత్తి శిక్షణ పొందిన వారికి ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ అందజేశారు.గ్రామోద్యోగ వికాస్ యోజన’ పథకంలో భాగంగా గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించడానికి వీలుగా అధునాతన పనిముట్లు అందజేస్తున్నట్లు వారు తెలిపారు.

March 1, 2026 / 07:15 AM IST

నెమలి జాతరకు వైరా నుంచి ప్రత్యేక బస్సులు: డీఎం

KMM: గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 2వ తేదీన ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మధిర డిపో మేనేజర్ రామయ్య తెలిపారు. వైరా బస్టాండ్ నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. పెద్దలకు రూ. 60, పిల్లలకు రూ. 30, తెలంగాణ ఆధార్ కార్డు కలిగిన మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు.

March 1, 2026 / 07:15 AM IST

‘ఉపాధ్యాయుల జీతాలపై వ్యాఖ్యలు ఉపసంహరించాలి’

WGL: వర్ధన్నపేట పట్టణంలో తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో ఉపాధ్యాయులకు అధిక జీతాలు ఉన్నాయని పేర్కొనడాన్ని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు ధరావత్ కిషన్ నాయక్ ఆదివారం ఖండించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలోని కమిషన్ జీతాల తగ్గింపుపై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. జీతభత్యాల అంశాన్ని నివేదిక నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 07:14 AM IST

అక్రమ మొరం రవాణాపై మెరుపు దాడి.. 6 టిప్పర్లు సీజ్!

SDPT: ములుగు మండల కేంద్రంలోని కొక్కొండలో ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న నిందితులపై పోలీసులు మెరుపు దాడి చేశారు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి జరిపిన ఈ సోదాల్లో 6 టిప్పర్లు, ఒక హిటాచీని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.

March 1, 2026 / 07:11 AM IST

ఎలక్ట్రిక్ వాటర్ వీల్స్ అందజేసిన కేంద్రమంత్రి

PDPL: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఛైర్మన్ మనోజ్ కుమార్ శనివారం హైదరాబాదులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కుమ్మరి వృత్తి శిక్షణ పొందిన వారికి ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ అందజేశారు. ‘గ్రామోద్యోగ వికాస్ యోజన’ పథకంలో భాగంగా గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించడానికి వీలుగా అధునాతన పనిముట్లు అందజేస్తున్నట్లు వారు తెలిపారు.

March 1, 2026 / 07:07 AM IST

ముందస్తు చర్యలతో సన్నద్ధం కావాలి: అదనపు కలెక్టర్

BHPL: రబీ 2025–26 వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలతో సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ సమయానుకూలంగా ప్రారంభించాలన్నారు.

March 1, 2026 / 07:07 AM IST

జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే !

సూర్యాపేట జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 200 నుంచి రూ.220 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 10 వరకు తగ్గింది.

March 1, 2026 / 07:05 AM IST

ఈనెల 3న ఈ ఆలయంలో దర్శనాలు బంద్

HYD: ఈనెల 3వ తేదీన చంద్ర గ్రహణం సందర్భంగా శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులో గల సమతాస్ఫూర్తి కేంద్రంలో మార్చి 3న దర్శనాలు నిలిపేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 4న మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని, భక్తులు గమనించి సహకరించాలని వారు కోరారు.

March 1, 2026 / 07:03 AM IST

భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య

యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రానికి చెందిన మాదరబోయిన బిక్షం(64) భార్య ఉపేంద్ర గత కొంతకాలంగా జీవిస్తున్న దంపతులు మధ్య పదేపదే గొడవలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు సర్ది చెప్పినా వినకుండా తాగి రావడంతో విసిగిపోయిన భార్య అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బిక్షంని సుత్తితో బలంగా తలపైన కొట్టి చంపింది. ఈఘటనతో గుండాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

March 1, 2026 / 07:02 AM IST

జిల్లా ప్రజలు నిబంధనలు పాటించాలి

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.

March 1, 2026 / 07:01 AM IST

పుష్పయాగంలో పాల్గొన్న పోచారం

KMR: బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. శనివారం రాత్రి ముగింపు సందర్భంగా పుష్ప యాగ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతుల, ఆలయ ధర్మకర్త దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

March 1, 2026 / 07:01 AM IST

గంజాయి విక్రేతలను పట్టుకోవాలి: CP

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలో శనివారం CP సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ.. WGL కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రేతలను పట్టుకోవాలని అధికారులకు ఆదేశించారు. నగర శివారు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని, ఎంజీఎం ఆసుపత్రి, రైల్వే స్టేషన్ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల తనిఖీలు పెంచాలన్నారు.

March 1, 2026 / 06:59 AM IST

మిస్సింగ్ కేసు పై ప్రత్యేక దృష్టి సారించాలి: SP

BHPL: జిల్లా కేంద్రంలోని SP కార్యాలయంలో శనివారం జిల్లా SP సంకీర్త్ గౌడ్ ఆధ్వర్యంలో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసి అమలు చేయాలని SP ఆదేశించారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలని, సీసీ కెమెరాల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు.

March 1, 2026 / 06:56 AM IST

ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరిగితే చర్యలు: కమిషనర్

HYD: దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలపై ఊరటనిస్తూ వన్‌టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అన్నారు. పీటీపీ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

March 1, 2026 / 06:50 AM IST