నేడు వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదువుల తల్లి సరస్వతి దేవిని స్తుతించే పవిత్రదినం కావడంతో బాసరలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. తెల్లవారుజాము నుంచే పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిక...
పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు ని...
ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 74వ గణతంత్ర దినోత్సవ (Republic Day) శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్ధవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం గొప్పదనం, ప్రాధాన్యం వివరిస్తూనే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లితేన...
రిపబ్లిక్ డే వేడుకలు, పరేడ్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ప్రభుత్వం పరేడ్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంది. గురువారం రాజ్ భవన్‌లోనే పరేడ్ నిర్వహిస్తామని తెలియజేసింది. ఉదయం 6.50 గంటలకు రాజ్ భవన్‌లో పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏడు గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకకు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. తెలంగాణ రాష్ట్రంలో రిపబ్ల...
తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఏకంగా 60 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖను ప్రక్షాళన చేసినట్టు బదిలీలు ఉన్నాయి. ఒకే చోట అత్యధిక కాలం ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయిన జాబితాలో ఉన్నారు. ఈ బదిలీల విషయమై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ డీజీపీ, ఇతర ఉన్...
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా సీఎం కేసీఆర్ చాదర్ సమర్పించారు. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ పంపిస్తుంటారు. ప్రగతి భవన్‌లో బుధవారం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ప్రజలు, ప్రభుత్వం బాగుండాలని, సీఎం కేసీఆర్‌ను చల్లగా చూడాలని మత పెద్దలు ప్రార్థించారు. రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలని, దేశ ప్రజలంతా కలిసి మెలసి జీవించేలా దీవించాలని అల్లాను కోరారు. ఆ తర్వాత చాదర్‌ను వక్ఫ్ బోర్డు అధికార...
రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. యావత్ దేశం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటుందని గుర్తుచేసింది. పరేడ్ తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది. ఈ వేడుకకు ప్రజలను అనుమతించాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున రాజ్ భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖ రాశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. అక్కడ జరిగే వేడుకలకు ప్రభుత్వ ప్రతిన...
జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవీకి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందికి గురిచేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బలహీన వర్గానికి చెందిన మహిళను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘సంజయ్ దొర.. మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామా చేస్తున్నాను. మీ గడీల నుంచి బయటకు వస్తున్నా, ఇదిగో నా రాజీనామా ప...
గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కాకుండా వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదని...
నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ నిలవడంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సింగర్ రాహుల్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్‌కు స్వీట్స్ తినిపించి పుష్పగుచ్ఛం అందజేశి శాలువాతో సత్కరించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం అవార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఫైనల్స్‌కు నామినేట్ అయ్యింది. ఈక్రమంలో ప్రత...
జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం జనవరి 26వ తేది నుంచి 31వ తేది వరకూ రెడ్ అలర్ట్ ను కొనసాగించనున్నారు. ఈనెల 31వ తేది వరకూ ఎయిర్ పోర్టులో సందర్శకులకు అనుమతి లేదని తెలిపారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారులు, పోలీసులు ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకు...
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ తో పాటు 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రప...
మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో అర్దరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. గ్రామానికి చెందిన, పిట్టల అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. నిన్న మనవరాలు మధు తో కలిసి పెన్షన్, రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంలో భయాందోళనకు గురుయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమా...
హైదరాబాద్ లో వ్యాపారస్తులకు ఇది షాకింగ్ న్యూస్ వరుస ప్రమాదాల నేపధ్యంలో భాగ్యనగర లో వ్యాపారస్తులకు షాకిచ్చారు. ఇకపై వ్యాపారాలకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి చేశారు. దీంతో, ట్రేడ్, ఫుడ్, ఫైర్‌తోపాటు పోలీస్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సిందే. గతంలోనూ పోలీస్ లైసెన్స్ విధానం ఉంది. అయితే, 2014 తర్వాత దీన్ని రద్దు చేశారు. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలో పోలీస్ లైసెన్స్ నిబంధనలను పునరుద్ధరించారు. పోలీస్...
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, రాయదుర్గం – నాగోల్, ఎంజీబీఎస్ – జేబీఎస్ మార్గాల్లో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు మెట్రో సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో. ఈ మేరకు మెట్రో ఛార్జీలపై ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అధ్యయనం చేస్తోంది....