తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఏకంగా 60 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖను ప్రక్షాళన చేసినట్టు బదిలీలు ఉన్నాయి. ఒకే చోట అత్యధిక కాలం ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయిన జాబితాలో ఉన్నారు. ఈ బదిలీల విషయమై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ డీజీపీ, ఇతర ఉన్నత అధికారులతో చర్చించనట్లు తెలుస్తున్నది.
నల్లగొండ, సిరిసిల్ల, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల ఎస్పీలు మారగా.. కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో అత్యధికంగా డీసీపీలు స్థాన చలనం చెందారు. జగిత్యాల జిల్లా ఎస్పీగా భాస్కర్, రామగుండం కమిషనర్ గా సుబ్బారాయుడు, మల్కాజిగిరి డీసీపీగా జానకి ధరావత్, ఖమ్మం కమిషనర్ గా సురేశ్ బదిలీ అయ్యారు. ఎన్నికల ఏడాది కావడంతో పాటు సుదీర్ఘ కాలం పాటు ఒకే స్థానంలో ఉన్న వారిని బదిలీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.