పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు నివృత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఇందుకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ రాష్ట్రాలతో సమావేశాలు జరిగాయి. గోదావరి నదికి ఇంత వరకు గరిష్టంగా 36 క్యూసెక్కుల వరద వచ్చిందని, కానీ పోలవరాన్ని 50 క్యూసెక్కుల అంచనాలతో నిర్మించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్రానికి వెల్లడిస్తామని తెలిపారు.