రిపబ్లిక్ డే వేడుకలు, పరేడ్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ప్రభుత్వం పరేడ్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంది. గురువారం రాజ్ భవన్‌లోనే పరేడ్ నిర్వహిస్తామని తెలియజేసింది. ఉదయం 6.50 గంటలకు రాజ్ భవన్లో పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏడు గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకకు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారు.
తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గణతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌కే ఎందుకు పరిమితం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటిస్తారా? లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. గణతంత్ర వేడుకలకు కోవిడ్ కారణం చూపడం సరికాదని తెలిపింది. ప్రభుత్వం తప్పకుండా పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాలని తెలిపింది. పరేడ్ ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో రాజ్ భవన్లో పరేడ్ నిర్వహించే ఏర్పాట్లలో ప్రభుత్వం ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండిపెండెన్స్ డేను గోల్కొండ కోటలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తున్నారు. రిపబ్లిక్ డే మాత్రం పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సారి కరోనా సాకు చెప్పడంతో హైకోర్టు మండిపడింది. పరేడ్‌తో కూడిన వేడుకలను పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని స్పష్టంచేసింది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానించారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.