అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా సీఎం కేసీఆర్ చాదర్ సమర్పించారు. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ పంపిస్తుంటారు. ప్రగతి భవన్లో బుధవారం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ప్రజలు, ప్రభుత్వం బాగుండాలని, సీఎం కేసీఆర్‌ను చల్లగా చూడాలని మత పెద్దలు ప్రార్థించారు. రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలని, దేశ ప్రజలంతా కలిసి మెలసి జీవించేలా దీవించాలని అల్లాను కోరారు. ఆ తర్వాత చాదర్‌ను వక్ఫ్ బోర్డు అధికారులకు సీఎం కేసీఆర్ అందజేశారు.